
ఈరోజు అమరావతిలో చెన్నై రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. కాన్సులేట్ జనరల్ శ్రీ రాచా ఆరిబార్గ్ నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం వచ్చారు. ఈ సమావేశంలో CPF ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక కీలక ఘట్టంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలు, పరస్పర సహకార మార్గాలు తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించాము. రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రోత్సాహక విధానాల గురించి వారు ఆసక్తిగా తెలుసుకున్నారు. ముఖ్యంగా, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ టెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలు ఉన్నట్టు వివరించాము.
కాన్సులేట్ జనరల్ శ్రీ రాచా ఆరిబార్గ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. CPF ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు తమ సంస్థ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఏపీ రాష్ట్రం అందిస్తున్న సౌకర్యాలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు.
ఈ సమావేశం ద్వారా భవిష్యత్తులో థాయ్‌లాండ్‌తో మరిన్ని పెట్టుబడి అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు కలగొచ్చే అవకాశాలను పరిశీలించగలిగాం. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఇది మరొక ముందడుగు.
రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎంతో కీలకం. ఇలాంటి సమావేశాలు ఆ దిశగా కొనసాగాలని మేము ఆశిస్తున్నాం.


