
గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలవడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా TVS మోటార్ కంపెనీ మరియు గుజరాత్ టూరిజం సంయుక్తంగా రూపొందించిన “TVSM x Rann Utsav 2025” కాఫీ టేబుల్ బుక్‌ను ఆయనకు సమర్పించడం జరిగింది. ఈ బుక్ ప్రధానిగా మోదీ గారు ప్రేరణనిచ్చిన “యువతలో కచ్ ప్రాచుర్యం పొందాలి” అన్న దృష్టికోణంలో భాగంగా రూపొందించబడింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రణ్ ఉత్సవ్ సందర్భంగా TVS మోటార్ కంపెనీ ప్రత్యేకమైన మోటార్ సైక్లింగ్ అనుభవాన్ని సమకూర్చింది. కచ్ ప్రాంతంలోని సంస్కృతి, సహజ అందాలు, వారసత్వాన్ని విశేషంగా ఈ ఈవెంట్‌లో ప్రదర్శించారు. దీనిలో భాగంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌లో ఈ ప్రాంత విశిష్టతలు ఆకర్షణీయంగా పొందుపరిచారు.
‘సారీ ముజాఫిరీ’ అనే థీమ్‌పై రూపొందించిన ఈ బుక్‌లో, రణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలను హైలైట్ చేశారు. కచ్చితంగా ఈ బుక్ ఒక విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. ప్రకృతి అందాలు, కల్‌చర్ మిళితమైన అనుభూతిని అందిస్తుంది.
కచ్ నిజంగా మోటార్ సైక్లింగ్ ప్రేమికుల స్వర్గధామంగా మారింది. ఎవరైనా అక్కడ బైక్ రైడింగ్ చేస్తే, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని పొందుతారు. మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము – కచ్ చూసినవారు ఆశ్చర్యపోవడం ఖాయం!
ఈ బుక్ ప్రధాని మోదీ గారికి అందజేయడం ద్వారా, గుజరాత్ లోని కచ్ ప్రాంతం గురించి మరింత మంది తెలుసుకునేలా చేయడమే మా లక్ష్యం.