
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’పై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కళానిధి మారన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
గురువారం రాత్రి మేకర్స్ ఒక్కసారిగా ‘ఇంట్రడ్యూసింగ్ దహా’ అనే క్యాప్షన్‌తో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ లుక్‌ను రిలీజ్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సిగార్ తాగుతూ కనిపించే ఈ పోస్టర్‌లో ఆమిర్‌కు స్టైల్, ఇంటెన్సిటీ రెండూ బాగా సరిపోయాయి. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీర్ పాత్ర సినిమాలో కీలకమవుతుందని టాక్.
ఇక రజనీకాంత్ లీడ్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులను తెలుగు రాష్ట్రాల్లో డి.సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు భారీ ధరకు పొందారు. ‘ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించనున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘చికిటు’ అనే ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. వింటేజ్ స్టైల్లో రజనీకాంత్ స్టెప్పులు అభిమానులను కట్టిపడేశాయి. మాస్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ పాటలో ఉండటంతో సినిమా కోసం వేచి చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.
ఇక కథ, నటీనటుల బలమెంతో పాటు, లొకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తుండటంతో ‘కూలీ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. రజనీకాంత్, ఆమిర్ ఖాన్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందన్న ఉత్కంఠతో అభిమానులు జులై 14ను ఎదురుచూస్తున్నారు.