
పవన్ కేసరి (Pawan Kesari), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) జంటగా నటిస్తున్న కొత్త సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ ఇవ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
కావ్యా కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “దర్శకుడు, నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఈ కథ నాకు చాలా నచ్చింది. ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథ, మంచి భావోద్వేగాలు ఉన్న సినిమా అవుతుంది. విజయ్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో ఒక ప్రత్యేక అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతున్నాం” అని అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ, “శంకర్ చాలా బలమైన కథ రాసుకున్నారు. ఈ కథ విన్న వెంటనే నాకు నచ్చిపోయింది. ఈ సినిమా కోసం నేను ప్రత్యేకమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాను. పవన్ చాలా టాలెంటెడ్ హీరో, ఆయన ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారని నమ్మకం ఉంది. కావ్యా గారు కూడా ఈ చిత్రానికి చాలా పెద్ద ఎస్సెట్ అవుతారు” అని తెలిపారు.
దర్శకుడు కుంచం శంకర్ మాట్లాడుతూ, “ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక మంచి కథను రూపొందించాము. టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాపై పని చేస్తున్నారు. పవన్, కావ్యా జంట స్క్రీన్‌పై మంచి కెమిస్ట్రీ చూపిస్తారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనుకుంటున్నాం” అని అన్నారు.
ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, మ్యూజిక్, స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించబోతోందని చిత్రబృందం చెబుతోంది.


