
కేసీఆర్ కిట్ మళ్లీ తెలంగాణలో సామాజిక సేవ చర్చలకు హైలైట్‌గా మారింది, దీనికి కారణం బీఆర్ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ గారి మంచి మనసు. గతంలో సీఎం కేసీఆర్ మానవీయ కోణంతో తీసుకొచ్చిన ఈ కిట్‌తో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన ప్రతి తల్లి, శిశువుకు అవసరమైన వస్తువులు లభించేవి. కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసింది.
కేసీఆర్ కిట్‌ను నిలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాతృత్వాన్ని ప్రోత్సహించే కీలక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లులకు, శిశువులకు ఉపయోగపడే ఈ కిట్‌లో నిత్యవసర వస్తువులు, పోషకాహార పదార్థాలు ఉండటంతో ఇది గర్భిణీలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది.
ఈ నేపథ్యంలో కె.టి.రామారావు తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద 5 వేల కేసీఆర్ కిట్లను స్వయంగా పంపిణీ చేయడం విశేషం. తల్లుల ఆరోగ్యం, శిశువుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది. రాజకీయాలకుపైగా మానవతా విలువలకు ఈ చర్య చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
ప్రభుత్వం చేయని సేవను ఒక నాయకుడు స్వయంగా చేపట్టి నిర్వహించడమంటే, అది సేవా దృక్పథాన్ని వ్యక్తం చేస్తుంది. సామాజిక బాధ్యతను నిరూపించే ఈ చర్య తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
కేసీఆర్ కిట్ మళ్లీ ప్రజల మధ్యకు రావడంతో తల్లుల ఆనందానికి కొదవ లేదు. రామన్న ఇచ్చిన ఈ కిట్లు భవిష్యత్తులో మాతృత్వ సంక్షేమానికి మళ్లీ నూతన దారులను తెరవనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.