
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ సినీ కెరీర్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయోత్సవానికి ప్రత్యేకంగా ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ ట్రైలర్‌ను జూలై 25న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. ఇది ఇద్దరి అభిమానులకూ ఒక గిఫ్ట్ లా ఉండనుంది.
‘వార్ 2’ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ తొలిసారిగా ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
వేరే వేరే ఇండస్ట్రీల నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం చాలా అరుదైన విషయం. ఇది ఇండియన్ సినిమాకు ఎంతో గౌరవం తీసుకువస్తుందని యశ్ రాజ్ ఫిల్మ్స్ పేర్కొంది. 25 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ఈ హీరోల ఘనతను స్మరించుకుంటూ, ట్రైలర్‌ను విడుదల చేయడం మైల్‌స్టోన్ లా భావిస్తున్నారు.
ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కి, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.
నిర్మాణ సంస్థ తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో “ఇది జీవితకాలంలో ఒక్కసారి వచ్చే ఘట్టం. 2025లో ఇద్దరు లెజెండరీ హీరోలు 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. వార్ 2 ఆ వేడుకకు నిజమైన న్మస్కారం” అని పేర్కొంది.