
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 (War 2)పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
ఈ సినిమా విడుదలపై యష్ రాజ్ సంస్థ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విడుదల కావచ్చని అంచనా. లేటెస్ట్ సమాచారం ప్రకారం వార్ 2 సినిమాను 9,000 స్క్రీన్లపై రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అత్యధిక స్క్రీన్స్‌లో విడుదలైన సినిమా రోబో 2.0 కాగా, అది సుమారు 7,500 స్క్రీన్ల వరకు మాత్రమే విడుదలైంది. వార్ 2 దానిని మించి రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రైట్స్‌ను ప్రముఖ నిర్మాత సితార నాగవంశీ సుమారు రూ. 90 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇది ఒక రేంజ్‌లో నాన్-బాహుబలి లెవెల్ బిజినెస్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ యాక్షన్ మూవీలకు సెట్ అయ్యే స్టార్స్ కావడంతో ఈ కాంబోపై ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మాత్రం సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో చూడాలి. ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైల్‌స్టోన్ కావడానికి వార్ 2 సిద్ధంగా ఉంది.