
ఆసియాలోనే అత్యంత పొడవైన నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్ 1 ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో పూర్తి చేయించి తన మాట నిలబెట్టుకున్నారు. ఇది కేవలం ఓ అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాక, రాయలసీమ ప్రాంతానికి జీవనాధారం అయిన నీటిని అందించాలన్న సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశంతో, సమర్థవంతమైన వ్యవస్థాపక కృషితో ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడం అభినందనీయం.
ఈ ప్రాజెక్టు పూర్తవడంతో రాయలసీమలోని అనేక మండలాలకు సాగునీరు, తాగునీరు అందే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల రైతులకు ఇది వరంగా మారింది. పంటల సాగు పెరిగి, వ్యవసాయం మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాగునీటి సమస్యలు తీరిచే దిశగా కూడా ఈ ప్రాజెక్టు ప్రధాన పాత్ర పోషించనుంది.
మూడు రాష్ట్రాల నీటి వివాదాల మధ్య, ఇంత వేగంగా పనులు పూర్తి చేయడం సాధ్యం కాదన్న అనేక విమర్శలకు చంద్రబాబు గారు ఈ కార్యాచరణతో సమాధానం ఇచ్చారు. 100 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేయడం ఒక పరిపాలనా విజయం మాత్రమే కాదు, ప్రజల మీద నమ్మకాన్ని నిలబెట్టిన నిదర్శనం.
హంద్రీనీవా ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడం రాష్ట్రానికి నీటి పరంగా ఆత్మనిరభర్త ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టి రాష్ట్రాన్ని నీటి పట్ల స్వయం సమృద్ధిగా మార్చే దిశగా చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈ విజయంతో ప్రజలలో విశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమేనని మరోసారి రుజువైంది.