
ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తుంటారు. ప్రతీ కథానాయకుడు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఓ బిగ్ బడ్జెట్ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ, తన అందం, అభినయం, డెడికేషన్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. మొదటగా చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించినా, ఇప్పుడు టాప్ హీరోల సరసన నటించేంతగా ఎదిగిపోయింది. పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తూ తన మార్కు పెంచుకుంటోంది. నటనకు మించి పరిమితులు పెట్టుకున్న ఈ నటి, వ్యక్తిగత మౌలిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “సినిమాల్లో నేను కొన్ని సీన్స్ చేయను. అవి నా విలువలకు విరుద్ధంగా ఉంటే ఏ కథనైనా, ఎంత భారీ సినిమా అయినా కూడా వదులుకుంటాను. ఆలాంటి సీన్లు చేయాల్సి వస్తే, సినిమాని మాత్రమే కాదు ఇండస్ట్రీని కూడా వదిలేస్తా” అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇలాంటి వ్యాఖ్యలు చాలా అరుదుగా స్టార్స్ చేయడం వల్ల, ఆమె ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే ఆమె వైఖరిని ఆదర్శంగా చూస్తున్నారు. ఇలా ఒక్క వ్యాఖ్యతోనే ఆమెపై మరింత గౌరవం పెరిగింది. తను నటించే పాత్రల్లో ఎల్లప్పుడూ గౌరవప్రదమైన ఛాయలు ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు… నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్నా.


