
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (#APCRDA) ఆధ్వర్యంలో విజన్ 2047 రూపకల్పన జరుగుతోంది. ప్రపంచ స్థాయి, ఆధునిక సౌకర్యాలతో, సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అమరావతిని ఒక ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ దిశగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, భవిష్యత్తు తరాలకు ఉత్తమ రాజధానిని అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది.
ఈ విజన్‌లో భాగంగా, పౌరులు, నిపుణులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులు, సామాజిక సంస్థలు తదితరుల సూచనలను సమీకరించేందుకు APCRDA ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రాధాన్యతలు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి ఒక్కరి సూచనను పరిగణలోకి తీసుకుని, భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది.
అమరావతిని సుస్థిర, స్మార్ట్, సాంకేతికత ఆధారిత రాజధానిగా తీర్చిదిద్దడానికి మీ సహకారం అవసరం. రహదారులు, రవాణా, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్యా రంగం వంటి అంశాలపై మీ ఆలోచనలు, ప్రాధాన్యతలు ఈ ప్రాజెక్ట్ విజయానికి పునాది రాళ్లు అవుతాయి. మీ సూచనలు అందించడం ద్వారా, మనం కలిసి అమరావతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతాం.
మీ విలువైన సూచనలను ఇవ్వడానికి ఈ లింక్ క్లిక్ చేయండి లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. ప్రతి ఒక్కరి అభిప్రాయం అమూల్యమైనదే. మన కలల రాజధాని నిర్మాణంలో అందరం భాగస్వామ్యం అవుదాం.
అమరావతి మనది – అభివృద్ధి అందరి బాధ్యత!
విజన్ 2047లో భాగస్వామ్యం అవుతూ, భావితరాలకు ఉత్తమ బహుమతిగా అమరావతిని అందిద్దాం.


